ఈ చిత్రం కథ గురించి నిర్మాత మాట్లాడుతూ..కథ ఫైనల్ అయ్యాక 'దేవుడు చేసిన మనుషులు' అనే టైటిల్ కరెక్ట్‌గా ఉంటుందని భావించి, దాన్నే ఫైనల్ చేశాం. ఇందులో వినోదమే ప్రధానం. భిన్నమైన సోషియో ఫాంటసీ సాధారణంగా సోషియో ఫాంటసీలంటే మనుషులు దేవలోకాలకి వెళ్లడమో, లేకపోతే దేవుళ్లే భూలోకానికి రావడమో కనిపిస్తుంది. కానీ ఈ సినిమా అలా ఉండదు. ఏ లోకంలో ఉన్నవాళ్లు ఆ లోకంలోనే ఉంటూనే కథ నడస్తుంది. ఆ రకంగా ఇది భిన్నమైన కథ అన్నారు.
అలాగే సినిమా చూశాక కచ్చితంగా ఓ హిట్ సినిమా చేశామని అనిపించింది. గతంలో నా సినిమాల విషయంలో నా అంచనాలెప్పుడూ విఫలం కాలేదు. ఈ సినిమా మీద కూడా నా అంచనాలు నిజమవుతాయి. కథాకథనాలే బలం పూరి జగన్నాథ్‌తో పనిచేయడం చాలా సంతోషందాయకం. అసలు పని వత్తిడి అనేది ఉండదు. ఆయనతో సినిమా చేసిన భావమే కలగలేదు. అంత సునాయాసంగా ఆయన ఈ సినిమా చేశాడు. ప్రకాశ్‌రాజ్ పాత్ర అదిరిపోతుంది. అలీ కేరక్టర్ హైలైట్‌గా ఉంటుంది. ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకునేవి ఈ సినిమా కథాకథనాలే. అలాగే పాటలు కూడా అని చెప్పుకొచ్చారు.
No comments:
Post a Comment