పవన్ కళ్యాణ్,దిల్ రాజు కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనుందంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద పెద్ద స్టార్స్ తో సినిమాలు చేసినా దిల్ రాజుకు ఇప్పటికీ పవన్ డేట్స్ ఇవ్వలేదు. అయితే రీసెంట్ గా పవన్ ...దిల్ రాజుకి ఓ చిత్రం చేస్తానని మాట ఇచ్చినట్లు సమాచారం. దాంతో దిల్ రాజు ఈ జనగణమణ టైటిల్ ని రిజిస్టర్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే దర్శకుడు ఎవరనేది మాత్రం తెలియరాలేదు. పవన్ తో చేయబోయే చిత్రం తమిళ,హిందీ,తెలుగు భాషల్లో చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గ
ఇక జనగణమణ టైటిల్ ని దిల్ రాజు రిజిస్టర్ చేయగానే అంతా ఎన్టీఆర్,హరీష్ శంకర్ చిత్రం కోసం అని భావించారు. అయితే దిల్ రాజు అలాంటిది ఏమీ లేదని మరుసటి రోజు వివరణ ఇచ్చారు. దాంతో ఈ టైటిల్ ఖచ్చితంగా పవన్ కోసమే అని ఫిక్స్ అవుతున్నారు.
No comments:
Post a Comment