Tuesday, August 21, 2012

జూ ఎన్టీఆర్ కోసంకాదు : హరీష్ శంకర్....


యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందబోయే చిత్రానికి ‘జగగణమన' అనే టైటిల్ పెడుతున్నట్లు వస్తున్న వార్తలను....దర్శకుడు హరీష్ శంకర్ ఖండించారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదని స్పష్టం చేశారు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇటీవలే ఫిల్మ్ చాంబర్లో ‘జనగణమన' అనే టైటల్ రిజిస్టర్ చేయించారు. దీంతో ఆ టైటిల్ జూ ఎన్టీఆర్-హరీష్ శంకర్ చిత్రం కోసమే అంటూ ప్రచారం మొదలైంది. తాజాగా తేలిన విషయం ఏమిటంటే ఇటీవలే ఆగస్టు 15 నేపథ్యంలో దిల్ రాజు మనసులో ‘జనగణమన' అనే టైటిల్ ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చిందే ఆలస్యం దాన్ని రిజిస్టర్ చేయించారు. ఏదైనా దేశ భక్తి సంబంధమైన సినిమాకు దీన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నాడట.

ఇక ఎన్టీఆర్, హరీష్ శంకర్ దర్సకత్వంలో రూపొందబోయే చిత్రానికి 'ఎంఎల్ఏ' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారనే రూమర్లు వినిపిస్తున్నాయి. ఎంఎల్ఎ టైటిల్ అర్దం మంచి లక్షణాలన్న అబ్బాయి అని దర్శకుడి భావమట. టైటిల్ ఒకటే ఇలా రాజకీయాల్ని గుర్తు చేస్తుందా లేక సినిమా కూడా రాజకీయాలచుట్టూ తిర్గుతుందా అనేది ఇంకా తెలియరాలేదు. అయితే మాత్రం సినిమాలో పొలిటికల్ సెటైర్స్ మాత్రం ఉంటాయిని ఫిల్మ్ సర్కిల్సో లో వినపడుతోంది. రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో ఎన్టీఆర్ కి తండ్రిగా చేయబోతున్నారని వినికిడి.

No comments:

Post a Comment