Sunday, August 26, 2012

‘సుడిగాడు’కు సీక్వెల్ రాబోతుందట :-)...

 


పేరడీ సన్నివేశాల సమాహారం ‘సుడిగాడు’ సినిమాకు సీక్వెల్ రాబోతుందట. అల్లరి నరేష్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధిస్తున్న సుడిగాడు చిత్రానికి సీక్వెల్ తీస్తానని దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు ప్రకటించేశారు. దీనిని అల్లరి నరేష్ కూడా ఖాయం చేశాడు. చిత్రం ప్రమోషన్లో భాగంగా చెప్పారో లేక సీక్వెల్  ఈ సినిమాకు వచ్చిన స్పందన చూసి మరింత మంచిగా తీసి మెప్పించేందుకు ప్రయత్నమో గానీ సీక్వెల్ కు మాత్రం సిద్దమయిపోయారు ఇద్దరూ.
అవకాశం వస్తే ఈ చిత్రంలోనూ తానే హీరోయిన్ గా నటిస్తానని నటి మోనాల్ గజ్జర్ తెలిపింది. సుడిగాడు సినిమాలో పేరడీ హస్య సన్నివేశాలు ఎంతో బాగా ఉన్నాయని, అయితే కథ విషయంలో దర్శకుడు భీమనేని మరింత దృష్టి పెట్టి ఉంటే ఈ చిత్రం విజయం మరింత అద్భుతంగా ఉండేదని అంటున్నారు. మరి ఈ సూచనల నేపథ్యంలో భీమనేని రెండో సినిమాలో లోపాలు సవరిస్తే కామెడీ చిత్రాల్లో అది ఎవర్ గ్రీన్ గా నిలుస్తుంది...


No comments:

Post a Comment