త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘జులాయి’ చిత్రం రూ.40 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. నాలుగో వారంలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం ఇప్పటికి రూ.40 కోట్లు వసూలు చేసింది. మొదటి రెండు వారాల్లో ఈ చిత్రం రూ.32.46 కోట్లు వసూలు చేసింది. మొత్తం ఓవర్సీస్ వసూళ్లతో కలిపి ఇప్పటికి రూ.40 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. అమెరికాలో గత చిత్రాల కంటే ఈ చిత్రం ఎక్కువ వసూళ్లు సాధించింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇప్పటికే మెగా కుటుంబంలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ చిత్రాలు ఈ మొత్తం వసూలు చేసిన సినిమాల సరసన ఉన్నాయి. తాజాగా అల్లు అర్జున్ ‘జులాయి’ కూడా చేరడంతో మెగా కుటుంబానికి చెందిన ముగ్గురు హీరోలు ఈ క్లబ్ లో చేరారు. బద్రీనాథ్ వంటి డిజాస్టర్ తో ఉన్న అల్లు అర్జున్ కు ఈ చిత్రం హిట్ కావడం కొత్త ఊపిరినిచ్చింది.
No comments:
Post a Comment