Monday, August 13, 2012

తొలి ప్రయత్నంలో రాజమౌళికి తొలి ప్లాప్!.....

Director Rajamouli S First Flop
తన సినీ జీవితంలో అపజయం అంటూ ఎరుగకుండా దర్శక ధీరుడిగా దూసుకెళుతున్న రాజమౌళికి నిర్మాతగా తొలి ప్రయత్నంలోనే తొలి ప్లాప్ ఎదురైంది. రాజమౌళి కో ప్రొడ్యూసర్‌‍గా బాధ్యతలు స్వీకరించిన ‘అందాల రాక్షసి' చిత్రం డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. మొత్తానికి ఈచిత్రం ప్లాపు లిస్టులో చేరిందని సినీ క్రిటిక్స్ ఇప్పటికే తేల్చేశారు.
ప్లాపు అనే పదం రాజమౌళికి మింగుడు పడని అంశమే. ఎందుకంటే ఈ చిత్రంపై ఎన్నో ఆశలతో తొలి సారి పెట్టుబడి పెట్టాడు జక్కన్న. అయితే ఆయన అంచనాలు తారుమారయ్యాయి. నిజానికి రాజమౌళిపై నమ్మకంతో చాలా మంది ఈ చిత్రానికి వెళ్లి నిరాశకు లోనయ్యారు.

ప్రేక్షకుల నాడి తెలిసిన దర్శకుడిగా పేరున్న జక్కన్న....సినిమా బాగుందని చెప్పడం, ఆ సినిమాపై పెట్టుబడి పెట్టి మరీ ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగేలా చేశారు. అప్పటి వరకు ఎలాంటి అంచనాలు లేని ఈచిత్రం రాజమౌళి ఎంట్రీతో టాప్ రేంజి పబ్లిసిటీ సొంతం చేసుకుంది.

అయితే సినిమా తొలి సగ భాగంలో స్లో నేరేషన్, పేలవమైన ఎడిటింగ్, వీక్ క్లైమాక్స్ తదితర అంశాలు ఈచిత్రానికి మేజర్ డ్రాబ్యాక్స్‌గా మారాయి. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం కేవలం ‘ఎ' సెంటర్ల ప్రేక్షకులకు మాత్రమే పరమితం అయింది. బి, సి సెంటర్ల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆమోదించే పరిస్థితి కనిపించడం లేదు.

No comments:

Post a Comment