Monday, August 13, 2012

బాలకృష్ణ 'శ్రీమన్నారాయణ' స్టోరీ లైన్?

Srimannarayana Be Released This Month End
బాలకృష్ణ హీరోగా రవి చావలి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘శ్రీమన్నారాయణ'. ఈ నెల చివరి వారంలో విడుదలకు సిద్దమువుతున్న ఈ చిత్రం ప్రమోషన్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో బాలకృష్ణ జర్నలిస్టుగా కనిపించనున్నారు. ఈ చిత్రం స్టోరీలైన్ ఏమిటంటే.. ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్నారు. కనీసం పదిమందికైనా స్ఫూర్తి నింపాలనేది శ్రీమన్నారాయణ ఆశయం. అందుకే పాత్రికేయ రంగాన్ని ఎంచుకొన్నాడు. అన్యాయాలను తనదైన శైలిలో ఎదుర్కొన్నాడు. అయితే ఈ ప్రయాణం అనుకొన్నంత సులభం కాలేదు. అయినా సరే... సమాజంలోని కలుపుమొక్కల్ని ఏరిపారేయడమే లక్ష్యంగా ముందుకు సాగాడు. ఈ పోరాటంలో అతను ఏ రీతిన నెగ్గాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.

పార్వతి మెల్టన్‌, ఇషాచావ్లా హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి రమేష్‌ పుప్పాల నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత రమేష్‌ పుప్పాల మాట్లాడుతూ ''సామాజిక ఇతివృత్తంతో అల్లుకొన్న కథ ఇది. అక్షరాలనే ఆయుధాలుగా చేసుకొని శ్రీమన్నారాయణ పోరాటం సాగించిన తీరు అందరికీ నచ్చుతుంది. బాలకృష్ణ పలికిన సంభాషణలు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తాయి. చక్రి అందించిన బాణీలకు మంచి స్పందన వస్తోంది''అన్నారు.

ఇక గతంలో ది ఎండ్ వంటి సినిమాలను రూపొందించి రాష్ట్రపతి అవార్డు పొందిన రవిచావలి ఈ సినిమాను కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దానని అంటున్నారు. బాలకృష్ణ విషయానికి వస్తే..ఈ మధ్యే విడుదలైన ‘అధినాయకుడు' డిజాస్టర్ అయ్యింది. ఈ నేపథ్యంలో ‘శ్రీమన్నారాయణ' పై బాలయ్య మంచి అంచనాలు పెట్టుకున్నారు. బాలయ్య ఈసినిమాలో జర్నలిస్టు పాత్ర పోషిస్తున్నాడు. ఇలాంటి నేపథ్యంలోనే గతంలో ఇదే దర్శకుడు జగపతిబాబుతో ‘సామాన్యుడు' అనే సినిమా తీశాడు. సామాన్యుడు మంచి విజయం సాధించింది. అలాగే ఈ సినిమా కూడా హిట్టవుతుందని అంటున్నారు.

No comments:

Post a Comment