Thursday, August 23, 2012

‘దేవదాస్’గా మరిన హిరొ తనిష్....

Tanish Is New Devadas Tollywood
దేవదాసు, పార్వతి ప్రేమకథ గురించి అందరికీ తెలిసిందే. దేవదాసు క్యారెక్టర్‍‌ను ఇన్స్ఫిరేషన్‌గా తీసుకుని అదే టైటిల్‌తో తెలుగులో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. తాజాగా మరో ‘దేవదాసు' చిత్రం తెలుగు తెరపై ఆడబోతోంది. యంగ్ హీరో తనిష్ ఈ చిత్రంలో హీరోగా నటించబోతున్నాడు.
అయితే ఈ చిత్రం గతంలో వచ్చిన దేవదాసు చిత్రాల మాదిరి ఉండదని, ఈ తరం యువతకు నచ్చేలా, ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా దీన్ని రూపొందించబోతున్నారు. ఈ చిత్రం ద్వారా జి. శ్రీనివాస్ అనే దర్శకుడు తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు.

సెప్టెంబర్ 7న తనీష్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈచిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. నిర్మాత వి.ఎస్. రామిరెడ్డి ఈచిత్రాన్ని వి.ఎస్.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి ఈచిత్రానికి స్వరాలు సమకూర్చనున్నాడు. హీరోయిన్, ఇతర తారాగణం, టెక్నీషియన్స్ వివరాలు సినిమా ప్రారంభం రోజున వెల్లడి కానున్నాయి.

No comments:

Post a Comment