యూత్ ఫుల్, ఫీల్ గుడ్ మూవీలు తీయడంలో మంచి పనితనం ఉన్న శేఖర్ కమ్ముల అఖిల్ కోసం ఒక మంచి యూత్ ఫుల్ సబ్జెక్టు రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రంలో ద్వారా అమల 20 ఏళ్ల తర్వాత మళ్లీ వెండి తెరపై కనిపించబోతోంది.
ఈ క్రమంలోనే అఖిల్ విషయం కూడా చర్చకు వచ్చిందని, శేఖర్ కమ్ముల దర్శకత్వలో అఖిల్‌ను వెండి తెరకు పరిచయం చేయడానికి నాగార్జున కూడా సుముఖంగా ఉన్నారని అంటున్నారు. కొన్ని రోజుల క్రితం జరిగిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఆడియో వేడుకకు నాగార్జున, అఖిల్, అమల హాజరవ్వడం, నాగార్జున శేఖర్ కమ్ములను పొగుడుతూ మాట్లాడటం వెనక అసలు కారణం ఇదే అని అంటున్నారు.
No comments:
Post a Comment