Sunday, August 19, 2012

ప్రపంచ సుందరి 2012 కిరీటాన్ని ఎగరేసుకెళ్లిన చైనా సుందరి.....


ప్రపంచ సుందరి 2012 కిరీటాన్ని 23 ఏళ్ల చైనా పీఆర్ సుందరి వెన్‌క్జియా యు ఎగరేసుకెళ్లింది. మన దేశానికి చెందిన వన్యా మిశ్రా ఫైనల్స్‌లో చోటు దక్కించుకోవడంతో కిరీటాన్ని కైవసం చేసుకుంటుందని అందరూ ఆశపడ్డారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చైనా సుందరి 2012 ప్రపంచ సుందరిగా నిలిచింది.

తొలుత టాప్ 15 అందాల సుందరుల పేర్లు ప్రకటించినప్పుడు వన్యా మిశ్రా పేరు ఉండటంతో ఇక అందాల సుందరి కిరీటం ఎంతో దూరంలో లేదనుకున్నారు. టాప్ 7లోనూ వన్యామిశ్రాకు చోటు దక్కింది. కానీ ప్రపంచం సుందరి 2012 ఫైనల్ పేర్లను చదివేటప్పుడు...

మిస్ వరల్డ్ మూడో స్థానం ఆస్ట్రేలియా అనగానే.. రెండో స్థానం ఎవరిదన్న ఉత్కంఠ. ఆ తర్వాత రెండో స్థానం వేల్స్ అనగానే ఇక ప్రపంచ సుందరి కిరీటం మిగిలిన ఐదుగురిలో ఎవరికి దక్కుతుందీ... వన్యా మిశ్రాకేనా..? అనుకునేంతలో మిస్ వరల్డ్ 2012 చైనా పీఆర్ అనగానే ఆశలు ఆవిరయ్యాయి. ఏదేమయినా చివరి వరకూ గట్టి పోటీ ఇచ్చి నిలబడిన వన్యా మిశ్రా ఏడో స్థానంతో సరిపెట్టుకుంది.

No comments:

Post a Comment