శృతి హాసన్ కు అన్నగా సోనూ సూద్. వింటుంటే ఏంటా ఈ కాంబినేషన్ అని ఆశ్చర్యంగా ఉందా. అవును మీరు చదివింది నిజమే అరుంధతి సినిమాలో ‘బొమ్మాళి నిన్నొదలా’ అంటూ అదరగొట్టిన సోనూసూద్ ఇప్పుడు కమల్ హాసన్ ముద్దుల కూతురు శృతి హాసన్ కు అన్నగా నటించేందుకు సిద్దమవుతున్నాడు. ఈ మేరకు దర్శకుడు, హీరో, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఈ పాత్రకు సోనూ సూద్ ను ఎంపిక చేశాడు.
తెలుగు ‘విక్రమార్కుడు’ చిత్రాన్ని ‘రౌడీ రాథోడ్’ పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేసి హిట్ కొట్టిన ప్రభుదేవా ఇప్పుడు తెలుగులో తనే దర్శకత్వం వహించిన ’నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సిద్దమవుతున్నాడు. ఈ చిత్రంకోసం తెలుగులో శ్రీహరి పోషించిన త్రిష అన్నపాత్రను బాలీవుడ్ లో సోనూ సూద్ పోషించనున్నాడు. అయితే శృతి హాసన్ కు అన్నగా సోనూ సూద్ ఏంటి ? అన్న విమర్శలకు తెలుగులో త్రిషకు అన్నగా శ్రీహరి ఏంటి ? అని విమర్శించారని తరువాత ఆ పాత్రలో శ్రీహరి నటన చూసి ఆయనే కరెక్ట్ అన్నారని, ఇప్పడూ అదే జరుగుతుందని ప్రభుదేవా చెబుతున్నాడు.
No comments:
Post a Comment