Tuesday, August 21, 2012

అల్లు అర్జున్ కి చిరంజీవి కాంప్లిమెంట్.....




మెగా స్టార్ చిరంజీవి ఎట్టకేలకు ‘జులాయి' చిత్రాన్ని వీక్షించారు. ఈచిత్రం చూసిన అనంతరం చిరంజీవి స్పందిస్తూ.....బన్నీ నటనలో బాగా మెచ్యూర్ అయ్యాడని కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. జులాయి చిత్రం విడుదలై దాదాపు రెండు వారాలు కావస్తున్నా....ఇతర పనుల బిజీ వల్ల చిరంజీవి ఇప్పటికే వరకు వీక్షించ లేక పోయారు. తాజాగా ఆయన కోసం స్పెషల్ షో వేశారు.
అల్లు అర్జున్, ఇలియానా జంటగా ఈచిత్రాన్ని తివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై డివివి దానయ్య సమర్పణలో ఎన్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ బ్యాంకు దోపిడీ సంఘటన చుట్టూ సాగే ఈ చిత్రంలో బన్నీ అద్భుతంగా నటించడంతో పాటు యాక్షన్ సీన్లు ఇరగదీశాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్లస్సయింది.

జులాయి మలయాళ వెర్షన్ ‘గజ పోకిరి' ఈనెల ఓనం పండుగ సందర్భంగా 18న విడుదల చేసారు. ఈ చిత్రం అక్కడ కోటి ఇరవై లక్షలుకు అమ్ముడైంది. ఆర్య 2, బద్రీనాధ్ చిత్రాలు కోటి రూపాయలు పైగా బిజినెస్ చేయటంతో ఈ క్రేజ్ వచ్చింది. ఇప్పటికే ఈచిత్రం దాదాపు 50 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ సాధించినట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment