Thursday, August 16, 2012

శతదినోత్సవానికి గబ్బర్ సింగ్ సిద్దం........




గబ్బర్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా తెలుగు చిత్ర పరిశ్రమకు తెలిపిన సినిమా. ఆయనకు చిత్ర పరిశ్రమలో తలెత్తుకునేలా చేసిన సినిమా. దర్శకుడు హరీష్ శంకర్ ను స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేర్చిన సినిమా. విఫలమవుతున్న నిర్మాత బండ్ల గణేష్ కెరీర్ కు ఊపిరినిచ్చిన సినిమా. హీరోయిన్ శృతి హసన్ కు సినీ పరిశ్రమలో ఐరన్ లెగ్ అన్న అపవాదును పోగొట్టిన సినిమా. తొలి విజయాన్ని అందించిన సినిమా. ఒక్కటేమిటి ఈ చిత్రం ఎందరికో ఈ సినిమా విజయం ఊహించని ఊరట నిచ్చింది. ఈ చిత్రం ఎల్లుండి (ఆగస్టు 18)తో 100 రోజులు పూర్తి చేసుకోబోతుంది.

బాలీవుడ్ ‘దబాంగ్’ను తెలుగు నేటివిటీకి తగ్గట్లు రీమేక్ చేసిన ఈ సినిమా రాష్ట్రంలో మొత్తం 54 కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకోబోతుంది. నైజాంలో 6, సీడెడ్ లో 17, గుంటూరులో 5, కృష్ణా జిల్లాలో 3, వైజాగ్ లో 11, తూర్పుగోదావరిలో 9, పశ్చిమ గోదావరిలో 3 కేంద్రాలలో ఈ చిత్రం వందరోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంటోంది. అయితే ఈ చిత్రం వందరోజుల వేడుకకు మాత్రం పవన్ కళ్యాణ్ నుండి అనుమతి లభించడం లేదు.  పూరి దర్శకత్వంలో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం షూటింగ్ లో ఆయన బిజీగా ఉండడంతో ఆయన సమయం కేటాయించలేకపోతున్నట్లు సమాచారం.

No comments:

Post a Comment