Thursday, August 2, 2012

'కెమెరామేన్ గంగతో ...'లో కేకపెట్టించే పవన్ డైలాగ్.......

Pawan Kalyan Dialogues Cgr
పవన్‌ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ చిత్రానికి డైలాగులు రాస్తున్నది పూరీ జగన్నాధ్ కావంటంతో వాటిపై అంతటా మరింత అంచనాలు ఉన్నాయి. వాటిలో కొన్ని లీకై నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. వాటిలో కొన్ని..
.
- గూంటాలకి గుడుంబా కాసే వాళ్లకి భయపడటానికి నేను పోలీస్ ని కాదు, పొలిటికల్ లీడర్ ని అంత కన్నా కాదు..ప్రెస్ ప్రెస్
- వీడు మంచోడా, చెడ్డోడా, తిక్కోడ అని తెలుసుకోవటానికి ట్రె చేయకు...నీ గుండెకు బ్రెయిన్ కు కనెక్షన్ కట్ అయ్యిపోద్ది.

- ఒరేయ్ నిన్ను కొట్టేయాలనుకుంటున్నాను...వెళ్లి మనుష్యులను తెచ్చుకో.

అంతేకాక ఠంగు తెగుద్ది అంటూ ఠాగూర్ లో చిరంజీవి అవినీతిపై చెప్పిన డైలుగులు వంటివి కూడా ఈ సినిమాలో చోటు చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం నైజాం రైట్స్ ని గీతా ఆర్ట్స్ వారు ఎనిమిదిన్నర కోట్లకు సొంతం చేసుకున్నట్లు సొంతం చేసుకున్నారు. 'కెమెరామేన్ గంగతో రాంబాబు'రిలీజ్ కు ముందే దాదాపు యాభై కోట్ల వరకూ బిజినెస్ జరగనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.

నిర్మాత మాట్లాడుతూ... "పవన్‌ కల్యాణ్‌ పాత్ర చిత్రణ, ఆయన నటన మాస్‌ను ఆకట్టుకొనేలా ఉంటాయి. పూరి శైలి సంభాషణలు అందర్నీ అలరిస్తాయి. పవన్‌ అభిమానుల సమక్షంలో ఓ పాట చిత్రీకరణకు సన్నాహాలు సాగుతున్నాయి''అన్నారు. ఇక ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మెకానిక్ గా కనిపిస్తారు. అనుకోని విధంగా మీడియాలోకి రావటమే కథాంశం అని చెప్తున్నారు.

పవన్ ఈ చిత్రంలో మెకానిక్ గా కనిపించి అలరించనున్నారు. నేటి రాజకీయాలపై ఓ వ్యంగాస్త్రంగా ఈ చిత్రాన్ని పూరీ రూపొందిస్తున్నట్లు సమాచారం. తమన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. పవన్‌కళ్యాణ్, తమన్నా కలిసి నటిస్తున్న తొలి సినిమా కూడా ఇదే. అక్టోబర్ 18న గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ముందే పూరీ ప్రకటించారు.

No comments:

Post a Comment