Thursday, August 2, 2012

ఆ రీమేక్ కు జూ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్?....

Ntr Do The Remake Sagara Sangamam
జూ.ఎన్టీఆర్ తాజాగా ఓ చిత్రం రీమేక్ చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అది మరేదో కాదు కమల్ హాసన్ నటించిన సాగరసంగమం. రెండు నెలల క్రితం ఓ పెద్ద ప్రొడ్యూసర్ ఎన్టీఆర్ ని కలిసి ఈ ప్రపోజల్ పెట్టాడని వినికిడి. అదీ కె.విశ్వనాధ్ దర్శకత్వంలో సినిమా అని, నృత్య ప్రదానంగా ఉండే కథని ఈ కాలానికి మార్చి స్క్రిప్టు చేస్తే తాను చేయటానికి సిద్దమే అని ఎన్టీఆర్ తాజాగా ఆయనకు కన్ఫర్మ్ చేసి చెప్పినట్లు సమాచారం.
ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వూ లో కూడా కె.విశ్వనాధ్ గారు తనను ఎన్టీఆర్ ని కలిసి తనకు సాగరసంగమం అంటే ఇష్టమని రీమేక్ చేయమని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది ఓ మాస్టర్ పీస్ అని ఆ సినిమాని మళ్లీ చేయటం రిస్క్ అని అంటున్నారు. అయితే ఈ మేరకు నెగోషియేషన్స్ జరుగుతున్నాయని,అన్నీ కలిసి స్క్ర్రిప్టు నచ్చితే ఎన్టీఆర్ చేసే ఆవకాసముందని తెలుస్తోంది.

No comments:

Post a Comment