బాలకృష్ణ అతిధి పాత్రలో మంచి అంచనాలతో
వచ్చిన మంచు మనోజ్ హీరోగా వచ్చిన భారీ సినిమా ‘ఊ కొడతారా?
ఉలిక్కిపడతారా?'. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఫైనల్ గా డిజాస్టర్ టాక్
తెచ్చుకుంది. ఓపినింగ్స్ బాగున్నా కలెక్షన్స్ పరంగా రెండో రోజుకే డ్రాప్
అయింది. మీడియాలో ఎన్ని ఇంటర్వూలు ఇచ్చి హైప్ తీసుకొచ్చినా ఫలితం లేకుండా
పోయిందని ట్రేడ్ లో అంటున్నారు. సినిమా లో కథ, కథనమే మైనస్ అవటమే సినిమాకు
టాక్ లేకుండా చేసాయి.
ఉన్నంతలో బాలకృష్ణ వుండడంతో ఆయన అభిమానులు వీకెండ్ లో కూడా టాక్ కు అతీతంగా సందడి చేసారు. అయితే నెగిటివ్ టాక్ సినిమాను బాగా దెబ్బతీసింది. ధియోటర్స్ పెరిగాయి,అద్బుతమైన ఆదరణ అంటూ మీడియాలో ఎంతగా చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఈ సినిమా వల్ల మంచు లక్ష్మి ప్రసన్న నటనకు మాత్రం మంచి పేరు వచ్చింది.
ఇక రాజమౌళి ఈగ సినిమా కలెక్షన్లు కాస్త తగ్గుముఖం పట్టినా, వీకెండ్స్ బాగానే వున్నాయి. ఈవారం విడుదలైన మరో రెండు సినిమాల్లో డబ్బింగ్ ‘దిల్‌సే' సోసోగా మిగిలిపోయింది. ఇక రాజేంద్రప్రసాద్ నటించిన ‘ఓనమాలు' కాస్త మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఫీల్‌గుడ్ సినిమాగా, కాస్త మంచి మెసేజ్ వున్న సినిమాగా దీనికి టాక్ వచ్చింది. అయితే కలెక్షన్లు మాత్రం చెప్పుకోతగ్గ రీతిలో లేవు.

No comments:
Post a Comment