Sunday, August 12, 2012

వర్మ ఆఫర్ రిజెక్టు చేసిన కమల్ హాసన్......

Kamal Hassan Reject Varma S Offer
తాజాగా రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన ఆఫర్ ని కమల్ హాసన్ రిజెక్టు చేసారు. ఆయన దర్శకత్వంలో '26/11' అనే చిత్రం రూపొందబోతోంది. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన కార్యక్రమాల్లోనే ఆయన నిమగ్నమై ఉన్నారు. ఈ చిత్ర కథలో ఉగ్రవాద నిరోధక సంస్థ ఉన్నతాధికారి పాత్ర కీలకం. ఇది రాకేష్‌ మారియా అనే ఐపీఎస్‌ అధికారి జీవితానికి దగ్గరగా ఉంటుందని బాలీవుడ్‌ సమాచారం. ఆ పాత్ర కోసం కమల్‌హాసన్‌నీ దర్శకుడు సంప్రదించారు. అయితే ఆయన రిజెక్టు చేసారని సమాచారం.

తర్వాత సంజయ్‌ దత్‌నీ అనుకున్నారు కానీ డిపార్టమెంట్ చిత్రం డిజాస్టర్ కావటంతో సంజూ సైతం వర్మ ప్రాజెక్టుపై ఆసక్తి చూపలేదు. దాంతో ఆ పోలీసు పాత్రను నానాపటేకర్‌ పోషిస్తున్నారు. నానా గతంలో వర్మ రూపొందించిన 'అబ్‌ తక్‌ చప్పన్‌'లో నటించారు. ముంబై లో 2008 నవంబరు 26న జరిగిన ఉగ్రవాద దాడులను కథగా మలచుకొన్నారు రామ్‌గోపాల్‌ వర్మ.డు '26/11' చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో తెలుస్తాయి.

No comments:

Post a Comment