Monday, August 6, 2012

'కెమెరామెన్‌ గంగతో...'లో సెకండ్ హీరోయిన్ గా ఆమె ...

Pawan Kalyan Romance Gabriela Bertante
పవన్‌కల్యాణ్‌ హీరోగా,పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు'. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూ స్కోప్ ఉందని సమాచారం. ఆ సెకండ్ హీరోయిన్ స్థానం బ్రెజిల్‌ మోడల్‌ గాబ్రియాలాకు దక్కింది.గాబ్రియాలా పాత్ర గరమ్‌ గరమ్‌గా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. నైట్‌ ఎఫెక్ట్‌లో కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. మణిశర్మ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాత. సమర్పణ: ఎస్‌.రాధాకృష్ణ

ఇక పూరీ జగన్నాధ్,రవితేజ చిత్రం 'దేవుడు చేసిన మనుషులు'లోనూ ఈ బ్రెజిల్ భామ ఓ ఐటం సాంగ్ లో డాన్స్ చేసింది. అలాగే అజిత్ 'డేవిడ్‌ బిల్లా'లోనూ మెరిసింది. 'రాంబాబు'లో ఈమె పాత్ర హైలెట్ గా నిలవనుందని చెప్తున్నారు. అలాగే ఈ సారి కెమెరామెన్‌ గంగతో రాంబాబు'లో ఓ హాట్ హాట్ సాంగ్ పెడుతున్నారు. అయితే గాబ్రియాలా చేయటం లేదు. ఈ సారి ఆ పాటలో పవన్‌తో కలిసి విదేశీ నర్తకి స్కార్లెట్‌ విల్సన్‌ ఆడిపాడుతోంది.
శ్రీకాకుళం యాసలో హుషారుగా సాగే ఈ గీతాన్ని భాస్కరభట్ల రవికుమార్‌ రాశారు. లండన్‌కి చెందిన స్కార్లెట్‌ హిందీలో 'షాంఘై' అనే చిత్రంలో ఐటెమ్‌ గీతం చేసింది. ఇటీవలే రామ్‌చరణ్‌ చిత్రం 'ఎవడు'లోనూ నర్తించింది. ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూర్చారు.తొలి కలయిక ‘బద్రి' తోనే సెన్సేషన్ సృష్టించిన పవన్‌కళ్యాణ్-పూరి జగన్నాథ్. ‘బద్రి' తర్వాత వాళ్లిద్దరూ మళ్లీ కలిసి సినిమా చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు వాళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘కెమెరామేన్ గంగతో రాంబాబు'. ‘గబ్బర్‌సింగ్' లాంటి సూపర్ హిట్ తర్వాత పవన్‌కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఇదే కావటంతో మరింత క్రేజ్ వచ్చింది.

‘కెమెరామెన్ గంగతో రాంబాబు'చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 18న విడుదల చేస్తామని దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని అంతకంటే ముందుగానే అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అనుకున్న దానికంటే షూటింగ్ పూర్తవుతుండటంతో ఈ మార్పులకు కారణమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తర్వాతి షెడ్యూల్ రామోజీఫిల్మ్ సిటీలో ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ జరిగే షూటింగుతో టాకీ పార్టు పూర్తవడంతో పాటు మేజర్ ఫైట్ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. పోస్టు ప్రొడక్షన్ పనులు, మిగిలి ఉన్న పాటల చిత్రీకరణ సెప్టెంబర్ నెలలో పూర్తికానున్నాయి.అక్టోబర్ 3వ తేదీ నాటికి సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యే అవకాశాలు ఉండటంతో అభిమానులు, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్ మేరకు అనకున్నదానికంటే వారం రోజుల ముందే అంటే అక్టోబర్ 11న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

No comments:

Post a Comment