Friday, August 10, 2012

'షాడో' షూటింగులో వెంకీ బిజీ.........

విక్టరీ వెంకటేష్ షాడో సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది జనవరి 25వ తేదీన ప్రారంభమైంది. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 11వ తేదీన విడుదల చేయడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. అంటే, సంక్రాంతి పర్వదినానికి ఈ సినిమాను విడుదల చేయాలనే సంకల్పంతో ఉన్నారని అనుకోవాలి. సంక్రాంతిని చాలా మంది తెలుగు హీరోలు శుభంగా పరిగణిస్తారు.
Venkatesh S Shadow Releasing As Sankranthi Treat

పైగా, సంక్రాంతి వెంకటేష్‌కు అత్యంత ప్రత్యేకమైంది. లక్కీ సీజన్ అని చెప్పాలి. బాడీగార్డ్, నమో వెంకటేష, లక్ష్మి వంటి వెంకటేష్ హిట్ చిత్రాలు పండుగ సీజన్లోనే విడుదలయ్యాయి. బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధించాయి. దాంతో షాడో సినిమాను సంక్రాంతికి విడుదల చేసే ఉద్దేశంతో నిర్మాతలు ఉన్నారు.

షాడో మాస్ ఎంటైర్‌టైనర్‌గా రూపొందుతోంది. వెంకటేష్ ఈ సినిమాలో అండర్ వరల్డ్ డాన్‌గా నటిస్తున్నాడు. ఈ పాత్రకు విభిన్న కోణాలున్నాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. వెంకీ సరసన తాప్సీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్, మధురిమ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

షాడో సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా, పరుచూరి కిరీటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. హైదరాబాద్, స్విట్జర్లాండ్, మలేషియాలో ఈ సినిమా షూటింగు జరుపుకుంది.

No comments:

Post a Comment