Thursday, August 2, 2012

‘జులాయి’లో సరికొత్తగా... .

Allu Arjun Great Dance Julayi
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డాన్స్ విషయంలో మంచి టాలెంట్ ఉన్న హీరో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ విషయంలో ఇతర హీరోలు అతనితో పోటీ పడటం కాస్త కష్టమే. తన బాడీని ఎలా అంటే అలా మెలికలు తిప్పడం కోసం అల్లు అర్జున్ తీవ్రంగా శ్రమిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో పలు సందర్భాల్లో గాయాలపాలైన సందర్భాలు కూడా ఉన్నాయి.

తాజాగా ‘జులాయి' చిత్రంలో అల్లు అర్జున్ సరికొత్త స్టెప్పులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఒక రకంగా ఈ చిత్రం ద్వారా డాన్స్ విషయంలో తనకు ఎవరూ సాటి రారు అనే విధంగా బన్నీ ఇరగదీశాడని టాక్. కొరియోగ్రాఫర్ తో కలిసి కొత్త రకమయిన స్టెప్స్ కోసం బన్నీ కష్టపడ్డారు. డాన్స్ ప్రేమికులకు మరియు అల్లు అర్జున్ అభిమానులకు ఇది ఆనందకరమయిన విషయం.

No comments:

Post a Comment