Monday, August 6, 2012

పవర్ ఫుల్ డైలాగులతో వస్తున్న బాలకృష్ణ......

Balakrishna Mass Dialogues
నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమాలంటేనే పవర్ ఫుల్ డైలాగులకు పెట్టింది పేరు. ఆయన అభిమానులు చాలా మంది బాలయ్య చెప్పే డైలాగుల కోసమే థియేటర్లకు వెళతారంటే...ఆయన డైలాగ్ డెలివరీకి ఉన్న డిమాండ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. త్వరలో బాలయ్య ‘శ్రీమన్నారాయణ' చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించబోతున్నారు.
ఇటీవల విడుదలైన ఈచిత్రం ట్రైలర్లో బాలయ్య చెప్పిన పవర్ ఫుల్ పంచ్ డైలాగులకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘‘ ఏ అడ్డాకైనా నేను రెడీ, కడప సెవెన్ రోడ్ సెంటర్ కి రానా, అనంతపురం సప్తగిరి సర్కిల్ కి రానా లేక పోతే కర్నూలు కొండారెడ్డి బురుజు ఓకేనా లేక విజయవాడ బెంజి సర్కిల్ ఓకేనా లేకపోతే కరీంనగర్ కాశ్మీరీగడ్డకు రానా...ఏబే బోల్ ! ఎక్కడికి వచ్చినా వో బనేగా షేర్ ఖాన్ కి అడ్డా..!'' అంటూ బాలయ్య చెప్పిన డైలాగులు అదుర్స్ అంటున్నారు ఫ్యాన్స్
ఆ డైలాగులు చూస్తుంటే మాస్ జనాన్ని దృష్టిలో పెట్టుకునే ఈచిత్రం రూపొందించినట్లు స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ జర్నలిస్టు పాత్రలో నటిస్తున్నారు. రవికుమార్ చావలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన పార్వతి మెల్టన్, ఇషా చావ్లా నటిస్తున్నారు. ఆగస్టు 6న ఆడియో విడుదల చేసి, ఇదే నెల చివరి వారంలో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

No comments:

Post a Comment