రాజమౌళి సృష్టించిన ‘ఈగ’ తెలుగు సినీ పరిశ్రమలో రికార్డులు సృష్టిస్తోంది. ఇంత వరకు హీరోలకు..అదీ అగ్ర
కథానాయకులకే రికార్డులు సృష్టించడం సాధ్యమని అన్న వాదనను రాజమౌళి తిరగరాశారు. ప్రయోగాత్మకచిత్రంతో చరిత్ర సృష్టించారు. రాజమౌళి అనే బ్రాండ్ నేమ్ మరింత సుస్థిరం చేసుకున్నారు.
సినిమా అయితే సంచలనంగానే నిలిచింది కానీ…భారీ కలెక్షన్లు, అందరూ అనుకొన్న ‘వందకోట్ల’ మార్కును రాజమౌళి ‘ఈగ’ అందుకోలేకపోయింది. చిన్న స్టార్ల సినిమానే అయినా..దర్శకుడి ఇమేజ్, గ్రాఫిక్స్ వర్క్, మౌత్ టాక్, తదితరాలతో ఈ సినిమా అవలీలగా తెలుగు సినిమాకు సంబంధించిన గత రికార్డును చేజ్ చేస్తుందని, చాలా ఈజీగా వంద కోట్ల మార్కును చేరుతుందనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఆ అంచనాలకు ఆమడదూరంలో నిలుస్తూ ఈగ దాదాపు 57 కోట్ల రూపాయల గ్రాస్ వద్దే ఆగిపోయింది. మూడో వారానికే ఈ సినిమా వసూళ్లు క్రమంగా తగ్గుముఖం పట్టాయని, ఫ్యామిలీ ఆడియన్స్ తో అంతో ఇంతో సినిమా పరువు నిలిచిందని, ప్రస్తుతం వారి రద్దీ కూడా పూర్తిగా తగ్గిపోయిందని ట్రేడ్ పండితులు అంచనావేస్తున్నారు. సినిమాలకు లాంగ్ రన్ అసాధ్యం అని తేలిపోయిన ప్రస్తుత తరుణంలో, అనేక సినిమాలు విడుదల అయిన కారణంతో ‘ఈగ’ కలెక్షన్లు మందగించడానికి కారణంగా కనిపిస్తోంది. అయినప్పటికీ…’ఈగ’ సినిమా అనేక టాలీవుడ్ రికార్డులను అధిగమించింది. 57 కోట్ల రూపాయల కలెక్షన్లతో మహేశ్్ బాబు బిజినెస్ మేన్ రికార్డు (44 కోట్ల అంచనా) ను భారీ తేడాతో అధిగమించింది ఈగ. ఇక తమిళ భాషలో సాధించిన వసూళ్లతో ఈగ నిర్మాతలు భారీ లాభాలు చవిచూశారు. ఇంతేగాక త్వరలో ఈగ హిందీలో 3డీ వెర్షన్ లో విడుదలవ్వనుండటం రాజమౌళి నిర్మాతలకు కాసుల వర్షంలో కురిపించే అవకాశం ఉంది.
మొత్తానికి ‘ఈగ’ తెలుగు ిసినీ పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఐదో స్థానంలో నిలిచింది. ఇంతకు ముందు రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మగధీర’ చిత్రానిదే వసూళ్లలో అగ్రస్థానం. ఆ తరువాత స్థానాల్లో తాజాగా పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’, మూడో స్థానంలో ప్రిన్స్ మహేష్ బాబు ‘దూకుడు’, నాలుగో స్థానంలో రాంచరణ్ తేజ ‘రచ్చ’ చిత్రాలు ఉన్నాయి. తాజాగా ఐదో స్థానంలో ‘ఈగ’ చిత్రం చేరింది. ఈ చిత్రం ఇప్పటికే 42 కోట్లు వసూలుచేయగా, రాష్ట్ర్రంలోనే 30 కోట్లు వసూలు చేసింది.

No comments:
Post a Comment