ఆయన భావించినట్లుగానే చిత్రం హిట్ అంటుండటంతో ఆయన మరింత హ్యాపీగా ఉన్నారట.
జులాయి చిత్రంపై ఇప్పటి వరకు ఎక్కడా డివైడ్ టాక్ రాలేదు. అల్లు అర్జున్ రవి పాత్రలో చాలా ఈజీ ప్రదర్శించారని ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అలాగే మధు పాత్రలో నటించిన ఇలియానా గ్లామర్ కనిపించింది. బిట్టూ పాత్రలో నటించిన సోనూ సూద్ పాత్ర రొటీన్ వలే ఉన్నప్పటికీ ఆకట్టుకున్నారు. ఇప్పటికే పాటలు హిట్ అయ్యాయి. అల్లు అర్జున్‌కు చాన్నాళ్ల తర్వాత మంచి హిట్ వచ్చిందని అంటున్నారు.
ఎనర్జిటిక్ అంటేనే అల్లు అర్జున్. ఈ సినిమాలోను బన్నీ మంచి ఎనర్జిటిక్‌గా నటించారు. డ్యాన్స్ కూడా అదరగొట్టాడు. అయితే అతని పాత్ర మాత్రం అతనిలోని పూర్తి నటనను బయటకు తీసుకు వచ్చేలా లేదని చెప్పవచ్చు. గ్లామర్‌గా కనిపించిన ఇలియానాకు నటనకు స్కోప్ కనిపించలేదు.
No comments:
Post a Comment